ప్రధానమంత్రి నరేంద్రమోడి రాష్ట్రానికి వస్తున్నారా? ఈ సమయంలో ఎందుకు వస్తున్నారు? వస్తే ఏమైనా ప్రకటిస్తారా? ఇవన్నీ సమాధానాలు లేని ప్రశ్నలే. అసలు మోడి రాష్ట్రానికి రావాల్సిన అవసరం ఏంటి? అంటే, పచ్చ మీడియా ప్రచారం చెబుతున్న ప్రకారం మార్చి 5వ తేదీలోగా ప్రధాని ఏపికి రావాలని అనుకుంటున్నట్లు ప్రధానిమంత్రి కార్యాలయం చంద్రబాబునాయుడు కార్యాలయానికి చెప్పిందట. పైగా ప్రధాని చేయాల్సిన శంకుస్ధాపనలు, ప్రారంభొత్సవాలు ఏవైనా ఉన్నాయా అని కూడా వాకాబు చేసిందట.

నిజంగానే ప్రధానమంత్రి రాష్ట్రానికి రాదలచుకుంటే ఆ ముక్కేదో ముందుగా బిజెపి ఎంపిలతో మాట్లాడితే సరిపోతుంది. కేంద్ర-రాష్ట్రప్రభుత్వాల మధ్య కానీ బిజెపి-టిడిపి మధ్య కానీ బడ్జెట్ నేపధ్యంలో నిధుల కోసం, ప్రత్యేకహోదా కోసం జరుగుతున్న రచ్చ అంతా అందరికీ తెలిసిందే. ఇటువంటి నేపధ్యంలో ప్రధాని రాష్ట్రానికి రావటమంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే, కేంద్రప్రభుత్వం మీద కావచ్చు లేదా బిజెపి మీద కావచ్చు జనాలంతా మండిపోతున్నారు.

ALSO READ:  How Sharmila Makes An Intelligent Political Entry In Telangana Politics?

ఇటువంటి పరిస్ధితుల్లో మోడి రాష్ట్రానికి వచ్చి సాధించేదేముంటుంది? అమరావతి శంకుస్ధాపనకు వచ్చినపుడు కూడా ‘చెంబుడు మంచినీళ్ళు-గుప్పెడు మట్టి’ మొహాన కొట్టి వెళ్ళిపోయారు. సరే, ఇక ప్రస్తుతానికి వస్తే, బడ్జెట్ సన్నాహక సమావేశాల్లో ఉండగా ప్రధానమంత్రి పర్యటన గురించి పిఎంవో నుండి ఢిల్లీ నుండి సమాచారం వచ్చిందట. దాంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందట. నిజంగానే మోడి గనుక రాష్ట్రానికి వస్తే బిజెపి-టిడిపిలో లాభమెవరికి, నష్టమెవరికి అన్న చర్చలు మొదలయ్యాయి. #KhabarLive