వరుసగా రెండు రోజుల నుంచి పెరుగుతూ వస్తోన్న బంగారం ధర ఈ రోజు తగ్గింది. రూ.70 తగ్గడంతో పది గ్రాముల బంగారం ధర రూ.31,750కి చేరింది. గత రెండు రోజుల్లో బంగారం ధర దాదాపు రూ.520 పెరిగింది. స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు మందగించడం కూడా పసిడి ధర తగ్గుదలకు మరో కారణమని బులియన్‌ ట్రేడింగ్‌ ‌ వర్గాలు వెల్లడించాయి.

పసిడి ధర కాస్త తగ్గగా.. వెండి ధర మాత్రం కాస్త పెరిగింది.నిన్న రూ.580లు తగ్గిన వెండి ధర నేడు రూ.370 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రూ.39,750కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ రావడంతో వెండి ధర పెరిగినట్లు ట్రేడర్లు చెబుతున్నారు.

ఇక అంతర్జాతీయంగానూ పసిడి ధర తగ్గింది. 0.50శాతం తగ్గడంతో ఔన్సు 1,346.50 డాలర్లు పలికింది. #KhabarLive

ALSO READ:  Distress Teachers Of Private Schools Feeling Bit-Relaxed With NGO's Noble Idea In Hyderabad