ఇదిలావుండగా, ఆంధ్రప్రదేశ్ కు ప్రధానమంత్రి నరేంద్రమోడి వస్తానంటే చంద్రబాబునాయుడు వద్దంటున్నారా? అన్నది అందరిని కలత పెడుతున్న ప్రశ్న. అయితే, రాష్ట్ర పర్యటనకు ప్రధాని అవసరం లేదని చెప్పటం ద్వారా మోడిని చంద్రబాబు అవమానించారా? టిడిపి నేతలు, పచ్చ మీడియా అవుననే అంటున్నాయ్. ఏపికి ప్రధానమంత్రి వద్దామనుకుంటున్నారు..ప్రధాని ప్రారంభించేంత ప్రాజెక్టులేమున్నాయి? లేకపోతే ప్రధానితో శంకుస్ధాపనలు చేయించే కార్యక్రమాలున్నాయా? అంటూ పిఎంవో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని అడిగినట్లు ప్రచారం జరిగింది. అదే విషయమై చంద్రబాబు టిడిపి ఎంపిలతో టెలికాన్ఫరెన్సులో మాట్లాడారు.

‘రాష్ట్రానికి సాయం చేసే దిశగా ప్రధాని ఏదైనా నిర్దిష్ట ప్రకటన చేపేటట్లతే ప్రధాని రావటం మంచిదేనన్నారు. అటువంటిదేమీ లేనపుడు రావటం ఎందుకు? అని చంద్రబాబు ఎంపిలతో అన్నారట. కాబట్టి పిఎంవో చేసిన వాకాబుకు మనం సమాధానం ఇవ్వటం కూడా అనవసరం అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. దాంతో ప్రధాని రాకను చంద్రబాబు అడ్డుకుంటున్నట్లుగా ప్రచారం మొదలైంది. ప్రధానమంత్రే రాష్ట్రానికి వస్తానంటే చంద్రబాబు అడ్డుకునే సాహసం చేస్తారా అన్నది ఇక్కడ ప్రధాన ప్రశ్న.

ALSO READ:  Can An Anti-Modi Alliance Defeat The BJP In 2019?

అవసరమున్నా లేకపోయినా ప్రముఖుల రాకను దృష్టిలో పెట్టుకుని ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపనలు ఏర్పాటు చేయటం చంద్రబాబు పెద్ద విషయం కాదు. గతంలో చాలాసార్లు చంద్రబాబు ఆ పనిచేశారు. ప్రధాని పర్యటనను చంద్రబాబు అడ్డుకుంటున్నారంటే రెండు పార్టీల మద్య వ్యవహారం చాలా దూరమే వెళ్ళేట్లు అందిరికీ అనుమానాలు మొదలయ్యాయి.

చంద్రబాబు విషయంలో మోడి నిర్ణయం తీసుకున్నారా? చంద్రబాబునాయుడు విషయంలో భారతీయ జనతా పార్టీ స్పష్టమైన అవగాహనతోనే ముందుకు పోతున్నట్లుంది. ఏపి విషయంలో కేంద్రం ఏమాత్రం వెనక్కు తగ్గకూడదని నిర్ణయించుకున్నట్లే కనబడుతోంది. ఏపికి ఇచ్చిన ప్రతిష్టాత్మక విద్యాసంస్ధలు, ప్రాజెక్టులు, నిధులపై 27 పేజీల నోట్ ను విడుదల చేసింది. అందులో మూడున్నరేళ్ళల్లో రాష్ట్రానికి సంబంధించి కేంద్రం ఇవ్వాల్సిందంతా ఇచ్చిందని, చేయాల్సిందంతా చేస్తోందని కేంద్రం పేర్కొంది.

కేంద్రం తాజా చర్యతో చంద్రబాబు బెదిరింపులకు, టిడిపి ఎంపిల ఆందోళనలను ఏమాత్రం ఖాతరు చేయటంలేదన్న విషయం స్పష్టమైపోయింది. ఆ విషయం చంద్రబాబు కూడా గ్రహించారు. అందుకే పచ్చమీడియాతో తనకు మద్దతుగా వార్తలు రాయించుకుంటున్నారు. ఎంపిలు ఎంత అరచి గీపెట్టినా ఇంతకుమించి ఇచ్చేది లేదు అన్నట్లుగా కేంద్రం వ్యవహరిస్తోంది.

ALSO READ:  'Munugode Bypoll Becomes Prestige Issue In Telangana'

చంద్రబాబేమో కేంద్రానికి మార్చి 5వ తేదీ వరకూ డెడ్ లైన్ విధించినట్లుగా పచ్చ మీడియా ప్రముఖంగా ప్రచారం చేస్తోంది. అయితే, మార్చి 5 వరకూ ఆగాల్సిన అవసరం లేదని కేంద్ర తన వైఖరిని స్పష్టం చేసింది. కేంద్రం తాజా చర్యతో బంతి చంద్రబాబు కోర్టులో పడింది. ఎన్డీఏలో నుండి వైదొలుగుతారా? తమ కేంద్రమంత్రులతో రాజీనామాలు చేయిస్తారా? ఎంపిలందరినీ రాజానామాలు చేయాలని ఆదేశిస్తారా? అన్న నిర్ణయం తీసుకోవాల్సింది చంద్రబాబే.

చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కేంద్రం లెక్కచేసేట్లు కనబడటం లేదు. ఎందుకంటే, ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేస్తే నష్టపోయేది చంద్రబాబే కానీ బిజెపి కాదన్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు గనుక బయటకు వచ్చేస్తే వెంటనే ‘ఓటుకునోటు’ కేసులో కదలిక వచ్చిందంటే చంద్రబాబు సంగతి గోవిందా. ఆ భయంతోనే రాష్ట్ర ప్రయోజనాలను కూడా చంద్రబాబు ఫణంగా పెడుతున్నాడంటూ వైసిపి ఎప్పటి నుండో ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ALSO READ:  #SourceInfo: More 'IT Raids' On TDP Leaders Soon?

కేంద్రం తాజా నిర్ణయంతో తేలుతున్నదేమిటంటే చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నా లేకపోయినా ఒకటే అని. కాబట్టి ఇక నిర్ణయం తీసుకోవాల్సింది చంద్రబాబే. ఎంత తొందరగా నిర్ణయం తీసుకుంటారు అన్నది చంద్రబాబు మీద ఆధారపడివుంది. మొత్తానికి రాష్ట్ర రాజకీయాలు త్వరలో పెనుమార్పులు రావటం ఖాయంగా కనిపిస్తోంది. #KhabarLive