ఒక అద్భుతం జరగబోతున్నదని ముందే ఎవరూ చెప్పలేరు. అద్భుతం జరిగిన తర్వాత దాని గురించి చెప్పాల్సిన అవసరం ఉండదు. కానీ తెలంగాణ జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇందుకు భిన్నమైనది. ఈ ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును కళ్లారా చూసినవారు మాత్రం కాళేశ్వరప్రాజెక్టు సాగునీటి చరిత్రలోనే ఒక మహా అద్భుతాన్నిఆవిష్కరించబోతున్నదని ముందే గుండె మీద చెయ్యివేసి చెప్పగలరు.

ఈ సందర్భంగా నేను వ్యక్తిగతంగా కాంగ్రెస్ పెద్దలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర నాయకులకు ఒక టే విజ్ఞప్తి చేస్తున్నా. కొన్నిగంటల పాటైనా రాజకీయకోణాన్ని పక్కనపెట్టి తెలంగాణ ప్రజల కోణంలో మీరు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శిం చి పనులను పరిశీలించండి. ఇలా చేయడంవల్ల వారి ఆలోచన విధానంలో కొంతవరకైనా మార్పు వస్తుందన్నది నా విశ్వాసం.గ

త మూడున్నరేండ్ల కిందటి వరకు తలాపునే గోదావరి పారు తున్నా ఒక్క నీటిబొట్టు కూడా దిక్కులేక ఎండిపోయిన తెలంగాణ మనది. ఉమ్మడి పాలకుల కుట్రల నుంచి తెలంగాణకు విముక్తి కలిగించడానికి నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్ లైన్‌తో ఉద్యమ రణ నినాదం చేసిన కేసీఆర్ తన ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడి సాధించుకున్న రాష్ట్రం మనది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకోవాలంటే గోదావరి, కృష్ణా నదు ల్లో మనకున్న నీటి వాటాలను పూర్తిగా వినియోగించుకోవడమే ఏకైక మార్గంగా భావించారు కేసీఆర్. ఇందులో భాగంగానే కోటి ఎకరాలకు సాగునీరిచ్చేలా తెలంగాణ సమగ్ర జలవిధానాన్ని ఆవిష్కరించారు. స్వయంగా తానే ఇంజినీర్‌గా మారి రాత్రింబవళ్లు చర్చోపచర్చలతో సమగ్ర ప్రణాళికలను స్వయంగా రూపొందించారు. తెలంగాణ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రాజెక్టులను రీ డిజైన్ చేసి, అందుకు సంబంధించిన వాస్తవాలను అసెంబ్లీ సాక్షిగా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

ఒక్క బాబ్లీ కాదు వందల సంఖ్యలో గోదావరి నదిపై అడ్డంగా మహారాష్ట్ర ప్రభుత్వం బ్యారేజీలు నిర్మించిన కారణంగా గోదావరిలో మనకు నీటి లభ్యత ఆశాజనకంగా ఉండదని అసెంబ్లీలోనే స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో ప్రాణహిత నది మాత్రమే మనకు దిక్కు అని భావించి న తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. గోదావరి నది ద్వారా మనకు వచ్చే ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలంటే గోదావరిపై విరివిగా బ్యారేజీలు నిర్మించడమే మార్గమని భావించింది. గోదావరి వరదలు వచ్చినప్పుడు మన బ్యారేజీలు, రిజర్వాయర్లలో నీళ్లు నిల్వ చేసుకోవాలి. గోదావరిలో నీటి లభ్యత లేకుంటే ప్రాణహిత నదీ జలాలను గోదావరిలోకి మళ్లించుకోవాలి. ఇదీ ప్రభుత్వ వ్యూహం. ఇందులోనుంచి పురుడు పోసుకున్నదే కాళేశ్వరం బహుళార్థ సాధక ప్రాజెక్టు.

ALSO READ:  A Billion Dollar Question: Who Will Call The Shots At Flipkart After Walmart Takes Over?

ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఎన్ని కుట్రలు జరిగినా, కోర్టుల్లో వం దల సంఖ్యలో కేసులు వేసినా తెలంగాణ ప్రభు త్వం వెనకడుగు వేయలేదు. 1832 కిలోమీటర్ల పొడవునా, 20 లిఫ్టు లు, 19 పంప్‌హౌజ్‌లు, 5 పాత జలాశయాలు, 20 కొత్తగా నిర్మిస్తున్న జలాశయాలు, 147.71 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో కాళేశ్వరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి తెలంగాణలో కరువు పరిస్థితులను శాశ్వతంగా పారదోలాలన్న లక్ష్యంతో పనులు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు పూర్తికావడంతో మొత్తం 18,25,700 ఎకరాల కొత్త ఆయకట్టుకు, ఎస్సారెస్పీ స్టేజ్-1,2 నిజాంసాగర్, సింగూర్ ప్రాజెక్టుల కింద 18,82,970 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కలిపి మొత్తం 37,08,670 ఎకరాలకు సాగునీరందడం మనం కలలుగన్న బంగారు తెలంగాణ దిశగా దూసుకుపోవడమే.

అయితే ఎక్కడా ప్రాజెక్టు పనులు జరుగడం లేదని, ప్రకటనలకే పరిమితమయ్యారని కొందరు గాంధీభవన్ పెద్దలు అదేపనిగా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇటీవల కేంద్ర జలసంఘం అధికారులు, గవర్నర్ నరసింహన్ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి పనులను పరిశీలించడమే కాక ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరు అద్భుతమని అభినందించారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై అసలుసిసలైన చర్చ మొదలైంది. రాజకీయ నాయకుల విమర్శలెలా ఉన్నా వివిధ వర్గాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపట్ల అమితాసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో మనం కూడా అక్కడికి వెళ్లి పనులను పరిశీలిస్తే ప్రాజెక్టు పట్ల అవగాహనతో పాటు వాస్తవాలు తెలుస్తాయని కొందరు పాత్రికేయులు భావించారు.

ఈ నేపథ్యంలో నేను దాదాపు ముప్ఫై మంది జర్నలిస్టులతో కలిసి ఈ నెల ఒకటిన హైదరాబాద్ నుంచి బయల్దేరి నేరుగా కాళేశ్వరం చేరుకున్నాం. రెండు, మూడు తేదీల్లో కన్నెపల్లి వద్ద నిర్మిస్తున్న మేడిగడ్డ పంప్‌హౌజ్, మేడిగడ్డ వద్ద బ్యారేజీ పనులు, సుందిళ్ల , మేడారం, లక్ష్మీపూర్, మిడ్‌మానేరు, అనంతగిరి, రంగనాయకసాగర్ ప్రాజెక్టు పనులు శరవేగంతో జరుగుతుండ టం చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాం. అక్కడి నిర్మాణాలు చూసి ఇది కలయా? నిజమా అని విస్మయం చెందాం. ఒక మహాయజ్ఞంలా సాగుతున్న భగీరథ ప్రయత్నాన్ని అభినందించని వారెవరు ఉంటారు?.

ఉమ్మడి పాలకులు తెలంగాణపై ఎంతగా పగబట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారో చెప్పడానికి మిడ్‌మానేరు ప్రాజెక్టు నిలువెత్తు నిదర్శనం. ప్రాజెక్టు పరిధిలోని రైతులు మాతో మాట్లాడుతూ ఎప్పుడో 198 0 దశకంలో మిడ్ మానేర్‌కు అప్పటి కాంగ్రెస్ పాలకులు శంకుస్థాపన చేసిపోయారని, మొక్కుబడిగా పనులుచేసి చేతులు దులుపుకున్నారని చెప్పారు. 1999లో మళ్లీ చంద్రబాబు సీఎం అయిన కొద్దిరోజుల తర్వా త ఆయన ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారని అప్పటి కాంగ్రెస్ నేత వైఎస్సార్ పదేపదే విమర్శలు చేయడమే కాకుండా నిరసనగా మిడ్‌మానేర్ శిలాఫలకం వద్ద మొక్కలు కూడా నాటారని ఎల్లారెడ్డి అనే రైతు చెప్పారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మరోమారు మిడ్ మానేరుకు శంకుస్థాపన చేసి శిలాఫలకం వేశారట. 2004లో వైఎస్ సీఎం అయిన తర్వాత ముచ్చటగా మూడోసారి శిలాఫలకం వేసినా పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా ఉన్నది.

ALSO READ:  Get Renew Online Your Driving Licence With 4 Simple Steps

టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిడ్ మానేరు పనులు శరవేగంతో సాగుతున్నాయి. మిడ్‌మానేరు పనులు జరుగుతున్న తీరుకు ఎం తో సంతోషంగా మాట్లాడిన రైతు ఎల్లారెడ్డిని నువ్వు టీఆర్‌ఎస్ చెందిన వాడివి కాబట్టి ఇంత ఆనందంగా ఉన్నావా అని అడిగా. నేను టీఆర్‌ఎ స్ పార్టీకి చెందిన వాడిని కాదని, బీజేపీలో ముఖ్య నాయకుడినని చెప్పా రు. లక్ష్మీపూర్ స్టేజ్-8లో చేపట్టి నిర్మాణం దాదాపు పూర్తయ్యే దశకు చేరిన సొరంగం, సొరంగంలో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన సర్జ్‌పూల్ ఒక మహాద్భుతంగా ఆవిష్కృతమయ్యాయి. టన్నెల్, సర్జ్‌పూల్ నిర్మాణం ప్రపంచమే అబ్బురపడేలా ఉంది. ఇలాంటి ప్రతిష్ఠాత్మకమైన టన్నెల్ దేశంలో నే ఎక్కడాలేదని ఇంజినీర్లు చెప్పారు.

స్విట్జర్లాండ్, ఇం గ్లండ్ దేశాల మధ్యలో ఉన్న టన్నెల్ పెద్దదని, లక్ష్మీపూర్ టన్నెల్ ఆసియాలోనే అతిపెద్ద టన్నెల్ అని ఇంజినీర్లు పేర్కొన్నారు. ఎలాంటి నిర్ల క్ష్యం లేకుండా నాణ్యతాప్రమాణాలను నూటికి నూరు శాతం పాటిస్తూ అత్యాధునిక సాంకేతికతను మేళవించి నిర్మిస్తున్న టన్నెల్, సర్జ్‌పూల్‌ను చూడటానికి రెండు కండ్లు చాలలేదు. అక్కడి నిర్మాణం తీరు, టెక్నాలజీని చూసి అస లు మనం ఇక్కడే ఉన్నామా? లేక అమెరికా లాంటి అగ్రదేశాల్లో ఉన్నామా అన్న భావన కలుగుతుంది. భూమికి 140 మీటర్ల లోతు నిర్మించిన టన్నెల్‌లోకి దిగినవారంతా కొత్త అనుభూతిని పొందారు. అత్యంత ఆధునిక ఇంజినీరింగ్‌కు ఈ టన్నెల్, సర్జ్‌పూల్ నిలువెత్తు సాక్ష్యంగా చరిత్రకెక్కనుంది.

ALSO READ:  'Illegal Pills' Given To 'Women Workers' In Tamil Nadu Garment Factories To Make Them Work Through 'Menstruational Pain'

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి పొడుగూతా నిర్మిస్తున బ్యారేజీలు, పంప్‌హౌజ్‌లు, టన్నెల్స్, సర్జ్‌పూల్స్ నిర్మాణాల వేగం పెంచడానికి రోజువారీ టార్గెట్లు ఫిక్స్ చేస్తున్నారు. రోజూ 3500 నుంచి నాలుగువేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ఏ రోజు లక్ష్యాలను ఆ రోజే చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న బ్యారేజీలు, పంప్‌హౌజ్ లు, టన్నెల్స్, సర్జ్‌పూల్స్ నిర్మాణాల చుట్టూ అత్యంత శక్తివంతమైన సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి వాటిని ప్రగతిభవన్‌కు, జలసౌధకు అనుసంధానం చేశారు. సీఎం కేసీఆర్ నిరంతరం సీసీ కెమెరాల ద్వారా ప్రత్యక్షంగా పనులను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు చేస్తున్నారు.

మంత్రి హరీశ్‌రావు బ్యారేజీలు, పంప్‌హౌజ్‌లు, టన్నెల్స్, సర్జ్‌పూల్స్ యూనిట్‌గా ప్రత్యేకంగా వాట్సప్ గ్రూపులు క్రియేట్ చేసి నిత్యం పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. సీఎం ఆదేశాల మేరకు హరీశ్‌రావు కాళేశ్వరం ప్రాజెక్టును తరచూ సందర్శిస్తూ ఇంజినీర్లకు తగి న సలహాలు ఇస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో చేపట్టిన బ్యారేజీ లు, పంప్‌హౌజ్‌లు, టన్నెల్స్, సర్జ్‌పూల్స్ పనులు ఒకేరకంగా శరవేగంతో జరుగుతుండటం నిజంగా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. ఇవన్నీ వచ్చే జూన్ నాటికే పూర్తవుతాయని ఇరిగేషన్ అధికారులు ధీమాగా చెప్పారు. ఇంత వేగంగా పనులు ఎలా చేస్తున్నారని ప్రశ్నించగా చేయాలన్న కసి ఉంటే ఏదైనా సాధ్యమని ఇంజినీర్లు అన్నమాటల అంతరార్థం తాము ఇంజినీర్లుగా కాకుండా మా తెలంగాణ ప్రజలకు ఏదో చేయాలని తపిస్తున్నట్లుగా ఉంది.

సీఎం కేసీఆర్ సంకల్పం, మంత్రి హరీశ్‌రావు కఠోర శ్రమ కలిసి తమలో కసి నింపిందని, అందుకే ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తున్నామని ఇంజినీర్లు గర్వంగా అన్నారు. దేశంలో అత్యంత గొప్ప ప్రాజెక్టుగా చరిత్రకెక్కనున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకుంటున్నందుకు తామెంతో గర్వపడుతున్నామని పలువురు ఇంజినీర్లు సంతృప్తి వ్యక్తంచేశారు. కాగా అన్ని వర్క్‌ల వద్ద యువ ఇంజినీర్లే అత్యధికంగా పనిచేస్తూ సమరోత్సహాంతో ముందుకు దూసుకెళ్లుతుండ టం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యేకత.

ఈ సందర్భంగా నేను వ్యక్తిగతంగా కాంగ్రెస్ పెద్దలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర నాయకులకు ఒక టే విజ్ఞప్తి చేస్తున్నా. కొన్నిగంటల పాటైనా రాజకీయకోణాన్ని పక్కనపెట్టి తెలంగాణ ప్రజల కోణంలో మీరు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శిం చి పనులను పరిశీలించండి. ఇలా చేయడంవల్ల వారి ఆలోచన విధానం లో కొంతవరకైనా మార్పు వస్తుందన్నది నా విశ్వాసం. #KhabarLive

SHARE
Previous article‘Naidu-Modi’ Or ‘TDP-BJP’ Open Sparring Is Just A ‘Public Stunt’
Next articleMassive Eye Screening Drive Planned For Telangana
A senior journalist having 25 years of experience in national and international publications and media houses across the globe in various positions. A multi-lingual personality with desk multi-tasking skills. He belongs to Hyderabad in India. Ahssanuddin's work is driven by his desire to create clarity, connection, and a shared sense of purpose through the power of the written word. His background as an writer informs his approach to writing. Years of analyzing text and building news means that adapting to a reporting voice, tone, and unique needs comes as second nature.