దక్షిణాది రాష్ట్రాలకు చెందిన సినీ నిర్మాతల జేఏసీ క్యూబ్‌, యూఎఫ్‌వో ప్రతినిధులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో మార్చి 2 నుంచి దక్షిణాదిలో సినిమాల ప్రదర్శన నిలిపివేయాలని నిర్మాతలు, పంపిణీదారులు నిర్ణయించారు. ఇవాళ బెంగళూరులోని ఫిలిం ఛాంబర్‌లో దక్షిణాది రాష్ట్రాల సినీ నిర్మాతలు, పంపిణీదారుల జేఏసీ సమావేశమైంది.

థియేటర్లలో సినిమాల ప్రదర్శనకు క్యూబ్‌, యూఎఫ్‌వో వసూలు చేస్తున్న అధిక ధరలను తగ్గించాలని నిర్మాతల మండలి నిర్ణయించగా..వారి నిర్ణయాన్ని క్యూబ్‌, యూఎఫ్‌వో ప్రతినిధులు అంగీకరించలేదు. దీంతో మార్చి 2 నుంచి సినిమాల ప్రదర్శన నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. #KhabarLive

ALSO READ:  Ace Cricketer 'Mahendra Singh Dhoni' - In A Class Of His Own