ప్రముఖ దర్శక, నిర్మాత రాంగోపాల్‌ వర్మ అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే వర్మ పై సామాజిక కార్యకర్త, మహిళా సంఘం నాయకురాలు దేవి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఈ కేసులో ఇదివరకే వర్మకు నోటీసులు అందించిన సిసిఎస్ పోలీసులు రెండో సారి కూడా నోటీసులు జారీ చేసి సోమవారం సీసీఎస్ కి హాజరు కావాలని సీరియస్ గా హెచ్చరించినట్లు సమాచారం. దీంతో పోలీసులు అదే రోజు వర్మ ను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

రామ్ గోపాల్ వర్మ ఇటీవల రూపొందించిన గాడ్ సెక్స్ ఆండ్ ట్రూత్ మూవీపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓ టీవీ చర్చా వేదికలో పాల్గొన్న వర్మ తనను అవమానించారంటూ సామాజిక కార్యకర్త దేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు అందించిన ఫిర్యాదులో ఆమె పేర్కొంది.

ALSO READ:  Ace Cricketer 'Mahendra Singh Dhoni' - In A Class Of His Own

అలాగే గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌ సినిమాను ఎవరైనా అడ్డుకుంటే కొడతానంటూ వర్మ బెదిరింపులకు పాల్పడుతున్నారని దేవి పేర్కొన్నారు. దేవి ఫిర్యాదు మేరకు రాంగోపాల్‌ వర్మపై పోలీసులు ఐటీ యాక్ట్‌ 67, ఐపీసీ 508, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఈ కేసుల విచారణలో భాగంగా సీసీఎస్ ఎదుట హాజరు కావాలని వర్మకు నోటీసులు అందించారు పోలీసులు. విచారణకు హాజరయ్యే క్రమంలో అతడిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం. #KhabarLive