మొట్టమొదట శ్రీదేవి మరణవార్త లోకానికి వెల్లడికాగానే దేశమంతా ఒక్కసారిగా షాక్ అయింది. వీరాభిమానులు రోదించారు. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు తల్లడిల్లిపోయారు. సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. ఏదోలే ఆమెకు ఇంతే ఆయుర్దాయముంది ఏం చేస్తామనుకుంటున్న సమయంలో అనుమానాలు పొడచూపుతున్నాయి. క్రమంగా అనుమానాలు పెనుభూతాలవుతున్నాయి.
ఆమె మరణం అనుహ్యమైన మలుపులు తిరుగుతోంది. ఎప్పుడు ఎవరి మెడకు ఏం చుట్టుకుంటుందో అర్థంకాకుండా ఉంది. గుండెపోటుతో చనిపోలేదని, బాత్‌టబ్‌లో పడిపోవడంతో ఊపిరి ఆడక మరణించిందని వైద్యులు పోస్టుమార్టం రిపోర్టులో పేర్కొన్నట్లు వార్తలొచ్చాయి. కాని ఇది నిజంగా ప్రమాదమేనా? లేదా ఆత్మహత్య చేసుకుందా? హత్య చేశారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
దీని ఫలితంగా శ్రీదేవి భర్త బోనీకపూర్‌ను దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశం వదిలి వెళ్లడానికి వీలులేదని ఆంక్షలు విధించారు. శ్రీదేవి బస చేసిన హోటల్ సిబ్బందిని విచారిస్తున్నారని సమాచారం. బోనీ కపూర్, శ్రీదేవి కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. శ్రీదేవి మరణం ఎలా సంభవించింది? అనే విషయంలో మళ్లీ విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు బదిలీ చేయడంతో ప్రత్యేక పోలీసులు రంగంలోకి దిగారు. వైద్యుల పోస్టుమార్టం నివేదికపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. బాత్‌టబ్‌లో మునిగి చనిపోయినట్లు ఎలా నిర్ధారించారో అర్థం కావడంలేదంటోంది.
గుండెపోటుతో చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో లేదు కాబట్టి ఎలా చనిపోయిందో నిర్థారణ కావాలంటున్నారు. కేసు విచారణ పూర్తయ్యేంతవరకు బోనీ కపూర్ దుబాయ్‌లో ఉండాల్సిందేనని పోలీసులు చెప్పారని సమాచారం. మరణంపై అనుమానాలు, విచారణ కారణంగా భౌతికకాయం ఇండియాకు రావడం ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. డెత్ సర్టిఫికెట్ జారీ చేసినప్పటికీ బాడీ అప్పగింతకు ఆలస్యం కావచ్చంటున్నారు. ఇక శ్రీదేవి రక్తంలో ఆల్కహాల్ ఉన్నట్లు, అది ఎక్కువ మోతాదులో ఉన్నట్లు వైద్యులు చెప్పారు.
అయితే అంత ఎక్కువగా ఆమే తాగిందా? బలవంతంగా తాగించారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. 21,22 తేదీల్లో ఆమె హోటల్ గది నుంచి అసలు బయటకు రాలేదు. ఎందుకు రాలేదు? ఇందుకు కారణాలేమిటని పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనిపై బోనీ కపూర్ కుటుంబ సభ్యులు మాట్లాడటంలేదట. పెళ్లి రిసెప్షన్ తరువాత బోనీ కపూర్ ఇండియాకు వచ్చి మళ్లీ దుబాయ్‌కు వెళ్లాడు. ఎందుకలా? శ్రీదేవి హోటల్ గది నుంచి బయటకు రాని రెండు రోజుల్లో ఏం జరిగింది? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు అన్వేషిస్తున్నారు. #KhabarLive