చదువుల నిలయమైన కళాశాలకు చెందిన హాస్టల్లో కిలోల కొద్ది గంజాయి పట్టుబడింది. విద్యార్థులకు మాయమాటలు చెప్పి వారి గదుల్లోనే గంజాయి కాటన్లు దాచి స్మంగ్లిగ్ కు పాల్పడుతున్న వార్డెన్ వ్యవహారం సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన సూర్యాపేటలో తీవ్ర కలకలం సృష్టించింది.

ఈ ఘటనకు సంబంధించి విద్యార్థులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సూర్యాపేట పట్టణంలో ఓ ప్రైవేట్ కళాశాల బాలుర హాస్టల్లో వార్డెన్ గా పనిచేసే ఓ వ్యక్తి గుట్టుగా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఇతడు గంజాయి ప్యాకెట్లను పరీక్ష పేపర్లని చెప్పి విద్యార్థుల గదుల్లో మంచాలకింద దాచిపెట్టాడు. అయితే అవి నిజంగానే పరీక్ష పేపర్లుగా బావించిన విద్యార్థులు రాత్రి సమయంలో ఆ కాటన్లను తెరిచారు. అయితే అందులో ప్రశ్నా పత్రాలకు బదులు గంజాయి బైటపడింది. దీంతో విద్యార్థుల సమాచారంతో కళాశాల వద్దకు చేరుకున్న విద్యార్థి సంఘాల నాయకులు ఆ గంజాయి కాటన్లను రోడ్డుపై పెట్టి ఆందోళన చేపట్టారు.

ALSO READ:  How To Do Successful 'Citronella Oil' Business In India?

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్ వద్దకు చేరుకుని 12 గంజాయి కాటన్లను స్వాధీనం చేసుకున్నారు. దీంట్లో మొత్తంగా సుమారు 100 కేజీల గంజాయి ఉన్నట్లు సమాచారం. ఈ గంజాయి పాకెట్లను తీపసుకువచ్చినట్లు గా అనుమానిస్తున్న హాస్టల్ ముందున్న ఓ ఆటోను కూడా పోలీసులు సీజ్ చేశారు. ఈ గంజాయి సరఫరాపై కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. #KhabarLive