ఒక మహిళా నేత తెలంగాణ సర్కారును షేక్ చేసింది. ఏకంగా సర్కారులో కీలకమైన మంత్రి కేటిఆర్ గురించి సంచలన విషయాలు వెల్లడించింది. అది కూడా మీడియా సాక్షిగా అసలు విషయాలు చెప్పేసింది. పర్సెంజీలు ఎలా తీసుకుంటారో బాహటంగా వివరించింది. ఇదంతా మంత్రిగారే చెప్పారంటూ కుండబద్ధలు కొట్టింది. దీంతో సర్కారు పెద్దల ఆగ్రహానికి గురైంది. పదవి పోగొట్టుకుంది. ఆమె ఎవరో కాదు… సిరిసిల్ల మున్సిపల్ ఛైర్ పర్సన్ సామల పావని. ఆమె కేటిఆర్ మీద ఏం మాట్లాడారు? ఎందుకు పదవి పోగొట్టుకున్నారు చదవండి స్టోరీ.

తెలంగాణ మంత్రి కేటిఆర్ గురించి అనుచితమైన వ్యాఖ్యలు చేసిన సిరిసిల్ల మున్సిపల్ ఛైర్ పర్సన్ సామల పావని షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఆమె కేటిఆర్ గురించి మాట్లాడిన మాటలకు బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందట రాజీనామా లేఖను వెలువరించారు. కౌన్సిలర్లకు ఒకటి రెండు శాతం తీసుకోవాలని మంత్రి కేటిఆరే చెప్పారంటూ సామల పావని మీడియా సాక్షిగా ప్రకటించారు. దీంతో మంత్రి కేటిఆర్ కు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది.

ALSO READ:  Why TRS Poor Performance And Kavitha's Defeat In LS Polls Makes 'Family War' In KCR's House?

అయితే ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపాయి. దీంతో ఆమె తక్షణమే రాజీనామా చేయాలంటూ పైనుంచి ఆదేశాలు అందినట్లు చెబుతున్నారు. తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీ నేతల పరువును సొంత పార్టీ వారే తీసి పారేస్తున్నారని జనాల్లో చర్చ జరుగుతోంది. ఏకంగా తెలంగాణ సిఎం తనయుడు, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ ఇజ్జత్ ఖరాబ్ అయ్యేలా కామెంట్ చేయడం పెద్ద రాజకీయ దుమారం రేగుతోంది.

సిరిసిల్లలో జరిగిన మున్సిపల్ బడ్జెట్ సమావేశం సందర్భంగా ఛైర్ పర్సన్ సామల పావని మీడియాతో మాట్లాడారు. కౌన్సిలర్లకు రావాల్సిన పర్సెంటేజీలు ఇవ్వకుండా కాంట్రాక్టర్లు వేధించడం సరికాదని ఆమె హెచ్చరించారు. మంత్రి (కేటిఆర్) గారే చెప్పారు కదా? అని ప్రశ్నించారు. ఈ తతంగం సిరిసిల్లలోనే కాదు రాష్ట్రమంతా జరుగుతున్నదే కదా? అని ప్రశ్నించారు. తనకు సంబంధించిన కాంట్రాక్టు లావాదేవీలన్నీ తన భర్త చూసుకుంటారని చెప్పారు. కౌన్సిలర్లు కూడా ఎంతో ఖర్చు పెట్టుకుని గెలిచారు కదా? వారికి రావాల్సిన కమిషన్లు వారికి సక్రమంగా కాంట్రాక్టర్లు ఇవ్వాలి కదా? అని ప్రశ్నించారు. #KhabarLive

SHARE
Previous articleExactly How ‘Empowered’ Are Women In India?
Next articleWill ‘Maha Yaagam’ Makes KCR The Next Prime Minister?
A senior journalist having 25 years of experience in national and international publications and media houses across the globe in various positions. A multi-lingual personality with desk multi-tasking skills. He belongs to Hyderabad in India. Ahssanuddin's work is driven by his desire to create clarity, connection, and a shared sense of purpose through the power of the written word. His background as an writer informs his approach to writing. Years of analyzing text and building news means that adapting to a reporting voice, tone, and unique needs comes as second nature.

1 COMMENT

Comments are closed.