తెలంగాణలో రాజకీయ వాతావరణం కాక మీద ఉంది. పోలింగ్ కు ఇంకా నెల రోజులు కూడా లేదు. ఇప్పటికే… రాజకీయవర్గాలు దూకుడు మీద వ్యవహారాలు చక్క బెడుతున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తూండగా… మహాకూటమి అభ్యర్థుల్ని ఖరారు చేసే దిశగా ఉంది. గెలుపు మాదంటే మాదని రెండు వర్గాలు చెబుతున్నారు. సర్వేలు రకరకాల ఫలితాలను ప్రకటిస్తున్నాయి.

అధికార వ్యతిరేకతను ప్రతిపక్షాలు ఓట్లుగా మల్చుకోగలుగుతాయా..?

ఎన్నికలు జరుగుతున్న కొన్ని రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులను పూర్తిగా..సింపుల్‌గా అంచనా వేయవచ్చు. ఉదాహరణకు.. రాజస్థాన్ పరిస్థితినే చూసుకుందాం..! అక్కడ భారతీయ జనతా పార్టీ ఓడిపోవడం ఖాయమన్న వాతావరణం ఏర్పడింది. అయితే తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. ఓ వైపు ప్రభుత్వ సానుకూలత ఉంది. మరో వైపు వ్యతిరేకత ఉంది.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు చోట్ల.. ప్రజలు… ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నించే వ్యతిరేకతను ప్రతిపక్షాలు.. ఓట్లుగా మరల్చుకోగలుగుతాయా..? లేదా అన్నది ప్రశ్న. ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రభుత్వానికి సానుకూలత ఉంది. ప్రతికూలతలు ఉన్నాయి. అలాగే ప్రతిపక్షాలకు అవకాశాలు ఉన్నాయి. వాటిని అవి ఉపయోగించుకుంటాయా లేదా అన్నది వారి చేతుల్లోనే ఉంది. పదిహేను రోజుల కిందట టీఆర్ఎస్‌కు ఉన్న సానుకూలత ఇప్పుడు లేదన్న పరిస్థితి ఉంది. అయితే ఇవన్నీ రేపు.. ఓటరను ప్రభావితం చేస్తాయా లేదా … అన్నది కీలకం. ఎందుకంటే.. ఇండియన్ ఓటర్ .. ఏ ప్రాతిపదిక ఓటు చేస్తారన్నది ఎవరూ చెప్పలేరు.

ALSO READ:  #BigIssue: Role Of 'Telugu States' Governor Is Under Scanner

ప్రభుత్వంపై అనుకూలతో పాటు వ్యతిరేకత కూడా ఎక్కువేనా..?

ప్రభుత్వానికి ప్రధానమైన బలం సంక్షేమ పథకాలు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లపై సానుకూలత ఉంది. పెంచుతామని కూడా చెబుతున్నారు. అలాగే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు బాగా టీఆర్ఎస్ ఇమేజ్ పెంచుకోవడానికి ఉపయోగపడ్డాయి. ఇక గ్రామీణ ప్రాంలకు ఉచితంగాతాల్లో బీసీ వర్గా గొర్రెలు, బర్రెలు పంపిణీ చేశారు.

ఈ వర్గాల్లో ప్రభుత్వవర్గాల్లో సానుకూలత కలిపిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్దిపొందుతున్న వారిలో ప్రభుత్వంపై సానుకూలత కనిపిస్తోంది. అయితే అదే సమయంలో దళిత వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. వారికి ప్రత్యేకమైన సంక్షేమ పథకాలు లేవు. అలాగే మూడెకరాల పంపిణీ జరగలేదు. వీరికి.. ఇతర సంక్షేమ పథకాలు వర్తించినా కూడా… తమకు ప్రత్యేకమైన సంక్షేమం లేదనే అసంతృప్తి ఉంది. ఎస్సీ వర్గీకరణ హామీ కూడా అమలు కాలేదు.

తెలంగాణలో సహజంగా మాదిగ జనాభా ఎక్కువ. సంక్షేమ పథకాల ప్రభావం ప్రజలపై కొంత విచిత్రంగా ఉంటుంది. తమకు ఎంత అందాయి.. అన్నదాని కన్నా… పక్క వాళ్లకు ఎంత ఎక్కువ లబ్ది చేకూరిందన్న విషయం.. ఓటర్లపై ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది. పెన్షన్స్‌లో కూడా ఈ ప్రశ్న వస్తోంది. గతంలో రూ. రెండు వందలు మాత్రమే పెన్షన్ ఇచ్చేవాళ్లు. అప్పట్లో.. ఇష్టం వచ్చినట్లు ఈ పెన్షన్లు ఇచ్చారు. అర్హులు కాని వాళ్లకు ఇచ్చారు. కానీ ఎప్పుడు అయితే.. పెన్షన్లు పెంచారో.. అప్పుడు అర్హులైన వారికి మాత్రమే ఇస్తున్నారు.

ALSO READ:  The Emergence Of The 'New Political Force' In TRS Unsettles The 'Election Equilibrium' In Telangana

ఆర్థిక భారం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్ని నిబంధనలు అమలు చేస్తున్నారు. అందుకే… పెన్షన్ ఎక్కువ వస్తున్న ఆనందం ఉన్నా.. కోత పడిన వాళ్లు కూడా ఎక్కువే ఉన్నారు. వీరిలో అసంతృప్తి ఉంది. అలాగే బీసీ వర్గాల్లోనూ… అసంతృప్తి కనిపిస్తోంది. గణనీయ సంఖ్యలో ఉన్న యాదవుల్ని పట్టించుకుంది కానీ.. తమకు పట్టించుకోలేదన్న భావం ఇతర వర్గాల్లో ఉంది. బీసీల్లో అనేక కులాలు ఉన్నాయి. వాటిని తమకు పట్టించుకోలేదన్న భావన వారిలో ఉంది. అలాగే.. దళితుల్లో తమకు ప్రత్యేకమైన స్కీములు లేవన్న భావనలో ఉన్నారు. అలాగే… ఆదివాసీల్లోనూ వ్యతిరేకత ఉంది. తమకు ఇస్తామన్న రిజర్వేషన్లు ఇవ్వలేదన్న అసంతృప్తి ఉంది. అలాగే లంబాడాలతో జరిగిన ఘర్షణల్లో తమను పట్టించుకోలేదన్న భావనలో ఆదివాసీలు ఉన్నారు.

ప్రతిపక్షాలు ఇంకా రేస్ ప్రారంభించలేదా..?

ప్రస్తుతం ప్రతిపక్షాలు ఇంకా సీట్ల సర్దుబాటులోనే ఉన్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే.. తమకే ఓట్లేస్తారన్నట్లుగా వారు ఉన్నారు. బలంగా ఉన్నంత వ్యతిరేకత ఉన్నంత మాత్రాన.. రాజకీయ లాభం కలుగుతుందా లేదా.. అన్నది ముఖ్యం. అలా జరగాలంటే.. ప్రతిపక్షాల రాజకీయ కార్యాచరణ ప్రారంభం కావాలి. అలా ప్రారంభమైన తర్వతా ప్రజలను ఎలా ఆకట్టుకుంటారనేది.. కీలకం. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న వర్గాలను తమ వైపు ఎలా మరల్చుకుంటారో అన్నది కీలకం.

అలాగే నిరుద్యోగుల్లోనూ అసంతృప్తి ఉంది. వారిని తమ వైపు ఆకట్టుకోవాలి. ఓ కేస్ స్టడీని పరిశీలిస్తే.. గొర్రెలిచ్చారని ఓ కటుంబం సంతోషపడి ఉంటుంది. కానీ ఆ కుటుంబంలో నిరుద్యోగి మాత్రం.. తన ఉద్యోగం ఇవ్వలేదని అసంతృప్తితో ఉంటారు. వారు ఎవరికి మద్దతుగా ఉంటారన్నది ఇక్కడ కీలకం. యవతలో మాత్రం.. తీవ్రమైన అసంతృప్తి ఉన్న మాట నిజం. ఇలా అసంతృప్తి ఉన్న వాళ్లు ఎంత మంది.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారన్నది కీలకం. గంపగుత్తగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసేలా.. ప్రతిపక్షాల రాజకీయ కార్యాచరణ ఉండాలి. అప్పుడే ప్రయోజనం కలుగుతుంది. ఉద్యోగుల్లో ఐఆర్ ఇవ్వలేదన్న అసంతృప్తి ఉంది. ఉపాధ్యయ బదిలీలు .. యూనిఫార్మ్ సర్వీస్ రూల్స్ అమలు కాలేదు కనుక.. వారిలో వ్యతిరేకత ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో కూడా అసంతృప్తి ఉంది.

ALSO READ:  NRC Fear Sparks Heavy Rush At Wakf Board And Qazi Offices Across Hyderabad

ప్రజలు మార్పు కోరుకుంటారా..?

తెలంగాణలో రాజకీయ చైతన్యం ఎక్కువగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలను, మంత్రులను కూడా నిలదీస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. అలాగే… టీఆర్ఎస్ పై ఉన్న సానుకూలత.. ఎమ్మెల్యేలపై లేదు.. కేసీఆర్ పై ఉన్న సానుకూలత పార్టీపై లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ పట్ల … సానుకూలత ఉన్నా… ఎమ్మెల్యేల వ్యతిరేకత ఉన్న చోట్ల.. బలమైన అభ్యర్థుల్ని ప్రతిపక్షాలు నిలబడితే… టీఆర్ఎస్‌కు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. కారణాలు ఏమైనా.. ఇప్పుడు ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. దీని పలితం ఎలా ఉంటుందో… డిసెంబర్ 11న తేలుతుంది. ప్రజలు ఈ గట్టునే ఉండాలా… ఆ గట్టుకు వెళ్తారా అన్న ది ప్రజలు … అప్పుడే తేలుస్తారు. #KhabarLive