జనసేన అధినేత పవన్ కళ్యాన్ 3 రోజుల రాయలసీమ కరువు యాత్ర అనంతలో ముగిసింది. అనంతపురం, కదిరి, దర్మవరం చివరిగా హిందూపురం అభిమానుల సమావేశంతో వారి కరువు యాత్ర ముగిసింది. ఒక్క పర్యటనతోనే ఒక నాయుకుడి రాజకీయాలను, వారు లేవనెత్తిన అంశాలపై నిర్ధారణకు రావడం సముచితం కాదు. కాని వారు ప్రస్తావించిన అంశాలు, వాటిపరిష్కారానికి వారు ఎంచుకున్న పద్దతులను పరిసీలిస్తే వారి నడక ఎలా ఉందో నిర్ధారణకు రావడం పెద్ద కష్టం కాదు. పవన్ అనంత యాత్రను పరిసీలిస్తే మాత్రం జనసేనాని దారి తప్పినట్లుగా అర్దం అవుతుంది.

అనంత కరువు- అధ్యయనం
అనంత పురం జిల్లాకు కరువు పుట్టినిల్లుగా మారింది. రాష్ట్రంలో దాదాపు ఉభయగోదావరి జిల్లాలతో సమానమైన విస్తీ ర్ణం ఉన్నా అనంత జనాబా మాత్రం అందులో ఒక్క జిల్లా అంత కూడా లేదు. అయినా అక్కడ కనిపించేది కరువే. ఒక ప్రాంతం కరువు గురించి తెలుసు కోవడానికి 50 శాతం గడిచిన లెక్కలు పరిసీలిస్తే తెలిసిపోతుంది. మరో 50 శాతం క్షేత్రస్థా యిలో పరిశీలిస్తే అర్థం అవుతుంది. కాని అనంతపురం జిల్లాను మాత్రం అందుబాటులో ఉన్న ఆధారాలతోనే 90 శాతం పరిస్థితి అర్దం అవుతుంది. మిగిలిన 10 శాతం జనంలోకి వెలితే సరిపోతుంది. ఎందుకు అంటే అనంత కరువు పట్ల ఎవరికి భిన్నమైన అబిప్రాయం లేదు విచిత్రమేమో గాని దానికి గల కారణాలపై కూడా వివాదం పెద్దగా లేదు.

ఏదైనా ఉంటే దానికి తగిన పరిష్కారం పై మాత్రమే. ఈ నేపథ్యంలో పవన్ అనంత కరువు యాత్రను చేసినారు. రాయలసీమకే చెందిన వారే ప్రధాన పార్టీలకు అధినేతలుగా ఉన్నా రాయలసీమ పట్ల వివక్షచూపుతున్నారు అన్న ఆవేదన రాయలసీమ వాసులలో ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతానికి సంబంధం లేని పవన్ సీమ సమస్యలంటూ యాత్రకు వచ్చారు. ఈ సమస్యల పరిష్కారానికి పరిమితులు ఉన్నా రాయలసీమ సమస్యలు రాష్ట్రంలో ఇలాంటి చర్యల వల్ల చర్చకు వస్తాయి. అలా ప్రభుత్వం, ప్రతిపక్షాల పై కొంతమేరకైనా వత్తిడి ఉంటుంది అన్న చిన్న ఆశమాత్రం రాయలసీమ వాసులకు ఉన్నది.

ALSO READ:  Who Will Be Benefited In Telangana 'Caste Politics'?

పవన్ 3 రోజుల యాత్ర సినిమాను తలపించింది. సినిమాలలో… ప్రజల కష్టాలను చూసి చలించిపోయిన హీరో వెనువెంటనే పరిష్కారానికి పూను కోవడం అంతే త్వరగా పరిష్కారం కనుగొనడంతో సినిమా ముగిస్తుంది. పవన్ కరువుయాత్రలో వ్యక్తం చేసిన విషయాలు, అందుకు చూపుతున్న పరిష్కార పద్దతులు, అందుకు తాను ఎంచుకున్న పద్ధతులు మాత్రం రాజకీయ సినిమానే తలిపించిది.

పవన్ 3 రోజుల యాత్ర సినిమాను తలపించింది. సినిమాలలో… ప్రజల కష్టాలను చూసి చలించిపోయిన హీరో వెనువెంటనే పరిష్కారానికి పూను కోవడం అంతే త్వరగా పరిష్కారం కనుగొనడంతో సినిమా ముగిస్తుంది. పవన్ కరువుయాత్రలో వ్యక్తం చేసిన విషయాలు, అందుకు చూపుతున్న పరిష్కార పద్దతులు, అందుకు తాను ఎంచుకున్న పద్ధతులు మాత్రం రాజకీయ సినిమానే తలిపించిది. రాయలసీమ సమస్యలు సినిమాలో చూపించిన విధంగా పరిష్కారం కావు. కారణం అనంతపురం కరువు దేవుడు సృష్టించిన కరువు కాదు. ప్రకృతి వలన వచ్చిన దుస్థితి అంతకన్నా కాదు. కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, నేడు నవ్యాంద్రలోనూ పాలించిన నేత వివక్ష పాలన వలన వచ్చిన దుస్థితి.

సీమలో నిర్మించాల్సిన ప్రాజెక్టులు నిర్మించకుండా సీమనుంచి వెలుతున్న నీటిని సీమకు దక్కకుండా మద్య కోస్తాకు తరలించిన ప్రభుత్వ విధానాల మూలంగా వచ్చిన కరువు మాత్రమే. ప్రత్యేకించి నాటి నుంచి నేటి వరకు ఘనత కెక్కిన సీమనేతల పదవికాంక్ష కారణంగా బలైన ప్రాంతం రాయలసీమ. ఈ విషయం అనంతకు వెల్లి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనసు పెట్టి ఆలోచిస్తే ప్రపంచంలో ఎక్కడ కుర్చోనయినా తెలుసు కోవచ్చు. అనంతకు వెల్లాల్సింది కేవలం జరిగిన అన్యాయాన్ని ప్రజల ముందు ఉంచి ఆ అన్యాయాన్ని సరిదిద్దడానికి తాను చేయబోయే కార్యచరణ చెప్పడకోసమే. ఇదే నేడు అనంతకు రాయలసీమకు కావాల్సింది.

ALSO READ:  How 'Sunrisers Hyderabad' Stormed Into #IPL2020 Playoffs?

పవన్ కరువు యాత్ర దారితప్పింది అని అనడానికి కారణం….
ఇప్పటివరకు రాయలసీమకు జరిగిన నష్టానికి పవన్ బాధ్యులు కారు. కారణం వారు అధికారంలో లేరు. కాని విభజన అనంతరం జరిగిన పరిణామాలకు బాధ్యత పవన్ ది కాకపోయినా అన్యాయాలను ప్రశ్నిస్తామని చెప్పి అమరావతి రైతుల కష్టాలను తెలుకోవడానికి అక్కడి వెల్లిన పవన్ రాజధాని కోల్పోయిన రాయలసీమ గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కనీస ధర్మం కాదా. హోదా గురించి మాట్లాడినంతగా చట్టపరంగా రాయలసీమకు రావాల్సిన విభజన హమీలైన కడప ఉక్కు, గుంతకల్లు రైల్వే జోన్, మన్నవరం, 12 వేల కోట్ల ప్యాకేజీ, ఎయిమ్స్, వ్యవసాయ విశ్వవిద్యాలయం, కేంద్రీయ విశ్వ విద్యాలయంపై మాట్లాడటం లేదు. అనంత కరువుకు మూలం నీటి సమస్య.

అందుకు కారణం సీమ నుంచి ప్రవహిస్తున్న నీటిని సీమకు హక్కుగా కేటాయించకపోవడం దాని గురించి మాట్లాడకుండా మిగిలిన విషయాలు ఎన్ని మాట్లాడినా సానుభూతే అవుతుంది. సానుభూతితో పెద్ద ప్రయోజనం ఉండదు. పవన్ గారు తొలి రోజు పర్యటనలోనే కీలవిషయాలు రెండు చెప్పినారు: 1 రాయలసీమ అభివృద్దికి తాను కట్టుబడి ఉన్నాను, 2 అనంతపురం నేతల వ్యవహర శైలి మారకుండా అనంత బతుకులు మారవు-అని. నిజానికి రెండు విషయాలు కీలకమైనవి. వారు హమీ ఇవ్వడం మంచిదే రాయలసీమ ప్రజలకు సంతోషాన్ని ఇచ్చేదే. కీలకమైన రెండవ విషయం అనంత నేతలు మారాలి.

జిల్లా నేతల వ్యవహర శైలి అనంత కరువుకు ఒకముఖ్యమైన కారణంగా చెప్పిన పవన్ రోజు తిరగకముందే అదే జిల్లా నేతలను ఇంటికి వెల్లి వరుసబెట్టి కలవడం అనంత ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి. ఏ నేతల వలన జిల్లాకు నష్టం అన్నారో ఆనేతలను కలిసి వైఖరిని మార్చుకోమని చెప్పినారా? లేక కలిసింది అధికారపార్టీ వారిని కాబట్టి వారివలన కాదు జిల్లా లోని ప్రతిపక్షనేతల వైఖరి మారాలని చెప్పదలుచుకున్నారా?

ALSO READ:  Why Telangana Gram Panchayat 'Sarpanchs' Choked In 'Debt Trap'?

జిల్లా నేతల వ్యవహర శైలి అనంత కరువుకు ఒకముఖ్యమైన కారణంగా చెప్పిన పవన్ రోజు తిరగకముందే అదే జిల్లా నేతలను ఇంటికి వెల్లి వరుసబెట్టి కలవడం అనంత ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి. ఏ నేతల వలన జిల్లాకు నష్టం అన్నారో ఆనేతలను కలిసి వైఖరిని మార్చుకోమని చెప్పినారా? లేక కలిసింది అధికారపార్టీ వారిని కాబట్టి వారివలన కాదు జిల్లా లోని ప్రతిపక్షనేతల వైఖరి మారాలని చెప్పదలుచుకున్నారా? వారే చెప్పాలి. పోనీ జిల్లాలోని నేతలను కలిసి మాట్లాడి సమస్యలు తెలుసుకుని మద్దతు కోరడం వారి ఉద్యేశం అయితే మంచిదే. కానీ కేవలం అధికార పార్టీ నేతలను మాత్రమే ఎందుకు కలవాలి. పవన్ గారి దృష్టిలో వై సీ పీ మంచి పార్టీ కాదు అనుకుంటే మిగిలిన వాపక్షాలు, లోక్ సత్తా, భాజపా అన్నిటికన్నా మించి నిరంతరం రాయలసీమ సమస్యలే ప్రధానంగా జిల్లాలో శక్తికి మించి పని చేస్తున్న రాయలసీమ సంస్థలతో మాట్లాడలేదు ఎందుకు. ఈ ఒక్క పర్యటనతోనే రాయలసీమ సమస్యలపట్ల పవన్ వైఖరిని నిర్ధారించలేము. రాయలసీమ సమస్యల పట్ల సానుభూతి, అండగా ఉంటామన్న హమీ పట్ల సీమ వాసులకు సంతోషాన్ని కలిగిస్తున్నా ఆ పర్యటనలోనే వారు వేసిన అడుగులు మాత్రం రెండు రోజులు పూర్తి కాకుండానే అసంతృప్పిని మిగిలించింది. ఏది ఏమైనప్పటికి ఆశతో ప్రారంభమైన పవన్ సీమ యాత్ర నిరాశ, అనుమానాలను మిగిల్చింది. #KhabarLive