కరీంనగర్ లో అధికార టిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కరీంనగర్ టిఆర్ఎస్ లో కొత్త చిచ్చు రాజుకున్నది. కరీంనగర్ కార్పొరేషన్ లోని 30వ వార్డు సభ్యురాలు జయశ్రీ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేస్తున్న సందర్భంలో ఆమె కంటతడి పెట్టారు. ఇంతకూ ఆమెకు వచ్చిన కష్టాలేంటని జనాల్లో చర్చ జరుగుతున్నది.

కీరంనగర్ కార్పొరేషన్ లో గత కొంతకాలంగా అధికార పార్టీలో కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. గతంలో స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు ఒక కార్పొరేటర్ కు మధ్య పెద్ద వార్ నడిచింది. ఎమ్మెల్యే తీరు కారణంగా 30వ వార్డు మహిళా కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ కంటతడి పెట్టుకుంది. తనపై ఎమ్మెల్యే పగపట్టారని, తన డివిజన్ లో అభివృద్ధి జరగకుండా అడ్డు తగులుతున్నాడని మండిపడ్డారు. ఆ ఘటన మరవకముందే మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అదే ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీరు కారణంగా మరో కార్పొరేటర్ కూడా రాజీనామా బాటు పట్టారు. ఆ వివరాలు చదవండి.

కరీంనగర్ కార్పొరేషన్ లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన 12వ డివిజన్ కార్పొరేటర్ మెండి శ్రీలత తన పదవికి రాజీనామా చేశారు. కార్పొరేటర్ పదవితో పాటు టీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఆమె భర్త చంద్రశేఖర్ కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్బంగా ఆదివారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీలత మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యే … ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తమను చిన్నచూపు చూడటం, అభివృద్దికి నిధులు కేటాయించకపోవడం వల్లే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేగాక ఓ భూమి వివాదంలో తన భర్త చంద్రశేఖర్‌ను ఎమ్మెల్యే కమలాకర్ పోలీసు కేసుల్లో ఇరికించారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే వేధింపులు ఆపకపోతే ఆయన ఇంటిముందు ఆత్మహత్య చేసుకుంటానని శ్రీలత హెచ్చరించారు.

ALSO READ:  Who Should The Telangana 'Sport Lover' Vote For In The Elections?

కరీంనగర్ లో 30వ వార్డులో జయశ్రీ అనే మహిళ భారీ మెజార్టీతో జయశ్రీ గెలుపొందారు. అయితే ఆమె డివిజన్ లో తన మీదే ఓడిపోయిన అభ్యర్థికి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రోత్సహిస్తూ తనను చిన్నచూపు చూస్తున్నారని ఆమె ఆరోపిస్తోంది.

తన డివిజన్ ను దత్తత తీసుకోవాలని మంత్రి ఈటల రాజేందర్ ను ఆమె కోరింది. ఒక సభలో ఆమె విన్నపాన్ని స్వీకరించిన మంత్రి ఈటల తాను 30వ డివిజన్ ను దత్తత తీసుకునేందుకు అంగీకరించారు. అనంతరం ఆ డివిజన్ కు 5కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం మంత్రి మంజూరు చేసినా ఎమ్మెల్యే అడ్డుతగిలి వాటిని రిలీజ్ కాకుండా చేశాడని ఆరోపించారు. గడిచిన మూడేళ్ల కాలంగా తనను వేధిస్తున్నారని ఆమె కంటతడి పెట్టారు. కేవలం ఎమ్మెల్యే వైఖరి కారణంగానే తాను ఇబ్బందులకు గువుతున్నానని చెప్పారు.

ALSO READ:  ‍‍Many Tough 'Challenges' Ahead For 'New Mayor' Of Hyderabad

తాను రాత్రికి రాత్రే నామినేటెడ్ పదవిని స్వీకరించిన వ్యక్తిని కాదని జయశ్రీ చెప్పారు. తన భర్త కష్టపడి ప్రజల్లో మంచిపేరు తెచ్చుకుంటేనే గెలిచానని గుర్తు చేశారు. పిచ్చుక లాంటి తన మీద అంత పెద్ద స్థాయిలో ఉన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎందుకు బ్రహ్మాస్త్రం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా డివిజన్ లో నన్ను గెలిపించిన ప్రజలకు క్షమాపణ చెప్పుకుంటున్నానని, ఎమ్మెల్యే అడ్డుపడడం వల్ల ఎలాంటి అభివృద్ధి చేయలేకపోతున్నానని ఆమె చెప్పారు. అందుకే తన రాజీనామాను ఎంపి, మంత్రి, సిఎం ఆఫీసుకు పంపినట్లు చెప్పారు.

మొత్తానికి కరీంనగర్ టిఆర్ఎస్ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మరి ఈ వివాదాన్ని అధికార పార్టీ పెద్దలు ఎలా పరిస్కరిస్తారో అన్న చర్చ ఇంకా సాగుతోంది.

వరుసగా ఇద్దరు మహిళా కార్పొరేటర్లు మీడియా ముందుకొచ్చి బహిరంగంగానే స్థానిక ఎమ్మెల్యే గంగుల మీద ఆరోపణలు గుప్పించడంతో టిఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే పదే పదే అధికార పార్టీ నేతలను టార్గెట్ చేయడం పట్ల పార్టీలో రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఈ అంశం పార్టీ అధిష్టానం దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారన్నది తేలాల్సి ఉంది.

ALSO READ:  Will High Court Spoil The Dreams of KCR On Early Elections?

గతంలోనూ కరీంనగర్ కార్పొరేషన్ లో శ్రీలత అనే 30వ డివిజన కార్పొరేటర్ రాజీనామా చేశారు. అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది ఆమెకు. ఆమె మీద పోటీ చేసి ఓడిపోయిన కార్పొరేటర్ ను గంగుల కమలాకర్ చేరదీసి తనను పట్టించుకోకుండా అవమానించారని ఆరోపించారు. తన డివిజన్ ను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ దత్తత తీసుకుని 5 కోట్ల రూపాయలను మంజూరు చేసినా.. ఆ పనులు జరగకుండా ఎమ్మెల్యే అడ్డుకున్నారని ఆరోపించింది. అందుకే తాను రాజీనామా చేసినట్లు ప్రకటించింది. గెలిచిన నాటినుంచి ఇదే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేసింది. ఎట్టకేలకు ఆ వివాదాన్ని అధికార పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని సద్దుమణిగేలా చేశారు. అయితే తాజాగా మరో వివాదం రేగడంతో అధికార పార్టీ ఇరకాటంలోకి నెట్టబడిందని చెబుతున్నారు. #KhabarLive