విరుద్ద భావాలు కలిగిన స్ప్లిట్ పర్సనాలిటీ సమస్యతో బాధపడుతున్న క్యారెక్టర్ గా అందులో హీరో విక్రమ అద్భుతంగా నటించారు. అప్పటి నుండి ఎవరైనా ఒకే సమయంలో రెండు విధాలుగా మాట్లాడుతుంటే అటువంటి వారిని అందరూ అపరచితుడు అని అనటం మొదలుపెట్టారు.

ఆమధ్య వచ్చిన ‘అపరిచితుడు’ సినిమా గుర్తుండే ఉంటుంది. విరుద్ద భావాలు కలిగిన స్ప్లిట్ పర్సనాలిటీ సమస్యతో బాధపడుతున్న క్యారెక్టర్ గా అందులో హీరో విక్రమ అద్భుతంగా నటించారు. అప్పటి నుండి ఎవరైనా ఒకే సమయంలో రెండు విధాలుగా మాట్లాడుతుంటే అటువంటి వారిని అందరూ అపరచితుడు అని అనటం మొదలుపెట్టారు. ఇంతకీ ఇదంతా ఎందుకంటే, తెలంగాణాలో, ఏపిలో ఆరు రోజుల పాటు పర్యటించి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాటలుల విన్న తర్వాత అందరికీ అపరచితుడే గుర్తుకు వస్తున్నాడు. ఇంతకీ ఆయనేమన్నారంటే…..

ప్రశ్నించటానికే పార్టీ అంటాడు.

*4 ఏళ్ళుగా అధికారపక్షాన్ని ప్రశ్నించిందే లేదు!!!

● ప్రజారాజ్యం, చిరంజీవిని చీటింగ్ చేసిన వారిపై పగతోనే జనసేన పెట్టాను అంటాడు.
*అదే నోటితో ద్వేషించే వారిని కూడా ప్రేమిస్తుంది జనసేన అంటున్నాడు!!

● తెలంగాణ కోసం రక్తం అయినా ఇస్తా అంటాడు.
*తెలంగాణా వస్తే బాధతో 11రోజులు అన్నం మానేసా అంటాడు.

● కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణా తెచ్చింది బీజేపీ అంటాడు.
*ఆంధ్రా నుంచి తెలంగాణాను విడదీయటానికి బీజేపీకి ఎంత ధైర్యం అంటాడు.

ALSO READ:  Why 'Dry Hijama' Is More Popular For 'Complex Diseases' In Hyderabad?

● రిజర్వేషన్స్ తీసేయాలి అంటాడు.
*కాపులకి రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటాడు!!!!

● కులమతాలకి అతీతం జనసేన అంటాడు.
*కులాల వారీగా మీ సమస్యలు తెలుసుకుంటాను అంటాడు .!!!

● నా తెలంగాణా ఇది ..జై తెలంగాణా అనే మాట వందేమాతరంతో సమానం అంటాడు.
* మరి తెలంగాణా ఉద్యమం సమయంలో ఏ రోజైనా జై తెలంగాణా అని ఒక్కసారీ అనలేదు!!!

● ఓటుకు నోటు కేసు కోర్టులో వుంది అంటాడు.
*జగన్ కేసు కూడా కోర్టులో వున్నా దోచుకున్నాడంటాడు!!!

● చంద్రబాబు, బీజేపీ హామీలకు గ్యారెంటీ నాదంటాడు.
*హామీలు నెరవేర్చక పోవటానికి వాళ్ళకు ఇబ్బందులు వున్నాయంటాడు!!!

● ఫాతీమా కాలేజీ సమస్య చిటికేసినంత ఈజీగా వారంలో తేల్చేస్తా అంటాడు.
*2నెలలైనా అతీగతీ లేదు వైఎస్సార్సిపి ఎంపిలు పోరాడుతుంటే కనీసం మద్దతు కూడా రాడు!!!

● పెరియార్ ఆదర్శం అంటాడు.
‘ఆఫీసులలో హిందూ దేవుడి ఫొటోలు పెడతాడు!!

● జనసేన జనంకోసం ….
నా జీవిత పోరాటం జనం కోసం అని 2014 నుంచి అంటూనే వున్నాడు.

*44 నెలలో కాలంలో 24 రోజులు మాత్రమే ప్రజలకోసం బయటకు వచ్చాడు అప్పుడు కూడా ప్రజలకోసం ప్రశ్నించింది లేదు!!!

● తెలంగాణా జనసేన తరపున ప్రజాసమస్యలపై ఏరోజు KCR ను కలవడు
*కానీ అజ్ఞతవాసి సినమా 5 షోల కోసం KCR కాళ్ళు పట్టుకుంటాడు!!!

ALSO READ:  What's Behind Sudden Change Of Governor In Andhra Pradesh?

● సీమాంద్రా పౌరుషం చచ్చిందా అంటాడు.
*జాతీయ సమైక్యతా అంటాడు

●జాతీయా సమైక్యత కోసమే జనసేన అంటాడు
*ఉత్తర భారత్ , దక్షిణ భారత్ అంటాడు.

● KCR నాలుక కోస్తా అంటాడు.
*KCR చాలా స్మార్ట్ అంటాడు!!!

● విగ్రాహారాదన తప్పు అంటాడు.
*కొండగట్టు ఆంజనేయ విగ్రహాన్ని ఆరాదించా అంటాడు!!!

● ఓటుకునోటు తప్పేముంది అందరూ ఇచ్చేదేగా అంటాడు.
*రాజకీయాలను మార్చేస్తా అంటాడు!!!

● అధికారంలో ఉన్న చంద్రబాబుకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి విమర్శించలేను అంటాడు.
*అధికారంలో వున్న బిజెపిని మాత్రం విమర్శిస్తాడు!!!

● కాంగ్రెస్ దేశాన్ని దోచుకుంది అంటాడు.
*దోచుకున్న కాంగ్రెస్ కు విహెచ్ హనుమంతరావు సిఎం అభ్యర్ది అయితే మద్దతిస్తా అంటాడు!!!

● చంద్రబాబు పాలన, కేసిఆర్ పాలన బేష్ అంటాడు.
*సమస్యలపై పోరాటానికే యాత్ర చేస్తా అంటాడు!!!

● బలమున్న చోటే పోటీ అంటాడు.
*అన్ని చోట్ల పోటీ చేస్తాం అంటాడు!!!

● చంద్రబాబు కు బ్రోకర్ ను కాదు అంటాడు.
*చంద్రబాబును పొగుడుతూ జగన్ ను విమర్శిస్తాడు!!!

● ప్యాకేజీ పాచిన లడ్డూ అంటాడు.
*పాచిన లడ్డూలు తీసుకున్న చంద్రబాబును మాట కూడా అనడు!!!

● ఆవేశంతో లడేంగే లడేంగే .. అని ఊగిపోతూ రెచ్చగొడుతూ మాట్లాడతాడు.
*మనకు ఆవేశం కాదు ఆలోచన ముఖ్యం అంటాడు!!!

ALSO READ:  Are Tollywood Mega Heroes Sulking?

● ప్రత్యక హోదా కోసం పోరాడతా అంటాడు.
*ప్రత్యేక హోదా మీద పోరాడితే కేసులు పెడతా అనే చంద్రబాబుకు కొమ్ము కాస్తాడు!!!

● పోలవరం ఆంధ్రాకు వరం అంటాడు.
*పట్టిసీమ పేరుతో దోచుకుని పోలవరం భవిష్యత్ నాశనం చేస్తుంటే పల్లెత్తు మాట అనడు!!!

● ప్రత్యేకహోదా కోసం జగన్ పోరాడుతుంటే
*జగన్ని విమర్శించి, చంద్రబాబును పొగుడుతాడు!!!

● ఓటుకునోటు కేసులో ఆధారాలతో పట్టుబడ్డ చంద్రబాబు మాత్రం మంచోడు అంటాడు.
*ఏ ఆధారాలు లేక పోయినా జగన్ దోచేసాడు అనేస్తాడు!!!

● జగన్ కు కేసులు వున్నాయి అంటాడు.
*చంద్రబాబుపై వున్న18 స్టేలు గురించి మాట్లాడడు !!!

● అవసరం లేకపోయినా తెలంగాణా కోసం రక్తం ఇస్తా అంటాడు.
*ప్రత్యకహోదా కోసం రక్తం దార పోసేలా పోరాటం చేస్తా అని మాత్రం అనడు !!!

● జనసేన పసిగుడ్డు అంటాడు.
*12 ఏళ్ళు రాజకీయాలగురించి ఆలోచించా అంటాడు!!!

● జగన్ ప్రత్యేక హోదా కోసం బంద్ కు పిలుపిస్తే
*ఆరోజే బంద్ ను విఫలం చేయటానికి రోడ్డు పైకి మనం రాకూడదు MP లు మాత్రమే పోరాటం చేయాలంటాడు!!!

● రాజధాని రైతుకు అండగా ఉంటా అని పెరుగన్నం తింటాడు.
*రాజధాని రైతులను చంద్రబాబు చంపుకు తింటున్న పల్లెత్తు మాట కూడా అనడు!!! #KhabarLive