లైంగిక వేధింపులని నిరసిస్తూ మొదలైన “MeToo” ఉద్యమం ప్రపంచ దృష్టిని ఎంతగానో ఆకర్షించింది.

ఇప్పుడు అదే కోవలో మరో ఉద్యమం మొదలయ్యింది. ఇది, హజ్ లాంటి ధార్మిక ప్రదేశాలలో జరిగే లైంగిక వేధింపులను నిరసిస్తూ మొదలైన ఉద్యమం.

సోషల్ మీడియాలో ఈ ఉద్యమాన్ని “MosqueMeToo” పేరుతో వ్యవహరిస్తున్నారు. ఈ హ్యాష్‌ట్యాగ్ కింద మత సంబంధిత ప్రదేశాల్లో జరిగే లైంగిక వేధింపుల గురించి మహిళలు చర్చిస్తున్నారు.

ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ మోనా ఎల్తహావి ఈ ఉద్యమాన్ని మొదలెట్టారు. 2013 సంవత్సరంలో హజ్ సమయంలో ఆవిడకు జరిగిన లైంగిక వేధింపుల గురించి “MosqueMeToo” ద్వారా ట్విటర్‌లో షేర్ చేశారు.

ఆ తరవాత “ఈ అంశంలో నా మొదటి ట్వీట్ చూశాక ఒక ముస్లిం మహిళ, ఆమె తల్లిపై హజ్ సమయంలో జరిగిన లైంగిక వేధింపుల గురించి నాకు మెయిల్ చేసారు. ఒక బాధాకరమైన కవితను కూడా పంపారు. ఆమెకు జవాబు ఇస్తున్నప్పుడు నా కన్నీళ్ళు ఆపుకోలేకపోయాను” అంటూ మోనా మరొక ట్వీట్ చేసారు.

ALSO READ:  ‍Will Intelligent Voter Accepts Sharmila’s Party In Telangana?

దీంతో ప్రపంచం నలుమూలల నుంచి ముస్లిం పురుషులు, మహిళలు ఈ హాష్‌ట్యాగ్‌ను ఉపయోగిస్తూ ట్వీట్ చెయ్యడం మొదలెట్టారు. 24 గంటలలోపే 2,000 ట్వీట్‌లు పోస్ట్ అయ్యాయి. ఇది, పార్సీ ట్విటర్‌లో టాప్ 10 ట్రెండ్స్‌లోకి ఎక్కేసింది. ఈ విషయంపై ట్వీట్ చేసిన చాలామంది మహిళలు తమ చేదు అనుభవాలను పంచుకున్నారు.

“నేను MosqueMeToo గురించి చదివాను. ఒక్కసారిగా 2010 లో నాకు ఎదురైన చేదు అనుభవాలన్నీ కళ్ళముందుకొచ్చాయి. ముస్లింలకు మక్కా చాలా పవిత్ర క్షేత్రం కాబట్టి అక్కడ ఎటువంటి తప్పుడు పనులు జరగవు అని అందరూ భావిస్తారు. కానీ అది నిజం కాదు” అని ఎగ్గీ లెగోరియో అనే మహిళ ట్వీట్ చేశారు.

ఒక అంచనా ప్రకారం, దాదాపు 20 లక్షల మంది ముస్లింలు ప్రతీ ఏటా హజ్‌కు వెళతారు. హజ్ యాత్ర, మక్కా దర్శనం ముస్లింలకు పవిత్రమైన, ముఖ్యమైన విషయం. అలాంటి ప్రదేశంలో కూడా మహిళల మీద అమానుష వేధింపులు జరుగుతుండటం, వారు లైంగికపరమైన అవమానాలను ఎదుర్కోవడం పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఈ హ్యాష్‌ట్యాగ్‌కు మద్దతు ప్రకటిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

ALSO READ:  Why BRS Supremo KCR Again Disrupts Telugu States’ Political Scenario?

చాలామంది ఇరానీ, పార్సీ మాట్లాడే మహిళలు తమకు జరిగిన చేదు అనుభవాలను పంచుకోవడం ద్వారా ఈ సమస్య ఎంత పెద్దదో ప్రపంచానికి తెలియజేస్తున్నారు. అంతేకాదు.. ఈ ఉద్యమం ప్రజల ఆలోచనల్లో కొంతైనా మార్పు తీసుకొస్తుందని వారు భావిస్తున్నారు.

“తవాఫ్ సమయంలో మా అమ్మను ఇటువంటి చర్యల నుండి కాపాడడానికి మా నాన్న ఆమెను అంటిపెట్టుకుని వెనకాలే నడుస్తూ ఉన్నారు. ఇది విని మగవాళ్ళందరూ ఆశ్చర్యపోయినట్టు నటించకండి!” అని నర్గెస్స్‌కా (NargessKa) అనే మహిళ ట్వీట్ చేసారు.

“లైంగిక వేధింపులకు గురైన నా అక్కచెల్లెళ్ళందరికీ నా సంఘీభావం. పవిత్రమైన స్థలాలలో కూడా భయంకరమైన మనుషులు ఉంటారు. వారి స్వభావం ప్రదేశాన్ని బట్టి మారకపోవచ్చు. ముస్లింలుగా మన తోటి స్త్రీలకు దీని గురించి అవగాహన కల్పించడం మన బాధ్యత” అని మరో మహిళ హనన్ ట్వీట్ చేసారు.

ALSO READ:  'Rogan Josh' - The 'Dying Art' Kept Alive In Some 'Gujarati Families'

హిజాబ్ అడ్డంకి కాదు!!‘

ఇరాన్‌లో హిజాబ్ వాడడం అనివార్యం. ఇక్కడ చాలా చోట్ల హిజాబ్ ధరించని మహిళలను ర్యాపర్ తీసేసిన క్యాండీ లేదా లాలీపాప్‌లతో పోలుస్తూ పోస్టర్లు పెట్టారు. ఓపెన్‌గా ఉన్న క్యాండీ, లాలీపాప్‌ల మీద ఈగలు ఆశగా వాలుతున్నట్టు ఆ పోస్టర్లలో ఉంటుంది. ఇరాన్‌లో అన్ని ఆఫీసుల్లోనూ, పబ్లిక్ ప్రదేశాల్లోనూ ఒక స్లోగన్ ఉంటుంది.. “హిజాబ్ అడ్డంకి కాదు, అది మీకు రక్షణ”!

ఈ మధ్య ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా పోరాటం జరిపిన 20 మందిని అరెస్ట్ చేసారు. సెంట్రల్ టెహరాన్‌లో ఒక అమ్మాయి తన హిజాబ్ తీసి విసిరేసిన తరవాత హిజాబ్‌కు వ్యతిరేకంగా ఈ ఉద్యమం మొదలయ్యింది.

హిజాబ్ తీసివేతను వ్యతిరేకిస్తున్నట్లుగానే, చాలామంది సంప్రదాయవాదులు ఈ “MosqueMeToo” ఉద్యమాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చిన మోనా ఎల్తహావి పైన విమర్శలు గుప్పిస్తున్నారు. #KhabarLive