తత్కాల్‌ ప్రయాణికులకు రైల్వేశాఖ గురువారం శుభవార్త తెలిపింది. తత్కాల్‌ కింద బుక్‌చేసుకున్న టికెట్లపై 100 శాతం రీఫండ్‌ను అందించనున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. ఈ-టికెట్లతో పాటు కౌంటర్‌లో తీసుకున్న టికెట్లకు కూడా రీఫండ్‌ వర్తిస్తుందని పేర్కొంది. కింద పేర్కొన్న ఐదు సందర్భాల్లో టికెట్‌ ధర మొత్తాన్ని ప్రయాణికులకు తిరిగి చెల్లిస్తామంది.

  1. తత్కాల్ లో రైల్వే టికెట్ మీరు కొనుగోలు చేసినట్లయితే.. ఆరైలు మూడుగంటలు, అంతకన్నా ఎక్కువ సమయం ఆలస్యంగా వచ్చినప్పుడు మీ టికెట్ డబ్బులు మీకు తిరిగి ఇస్తారు.

2. రైలును దారి మళ్లించినప్పుడు,

3. రైలును దారి మళ్లించినతర్వాత ప్రయాణికులు ట్రైన్‌ ఎక్కాల్సిన స్టేషన్‌ లేదా దిగాల్సిన స్టేషన్‌ లేదా రెండూ కొత్త మార్గంలో లేకపోతే

4. ప్రయాణికులు ఎక్కాల్సిన కోచ్‌ను రైలుకు అనుసంధానించకపోతే, అధికారులు ప్రయాణికులకు ప్రత్యామ్నాయం కల్పించనప్పుడు

ALSO READ:  Will Telangana Congress Chief Get Re-Elected From Huzurnagar Constituency?

5. రైలులో రిజర్వేషన్‌ చేసుకున్నదానికి బదులుగా లోయర్‌ క్లాస్‌లో ప్రయాణించేందుకు ప్రజలు ఇష్టపడకపోతే(ఒకవేళ ప్రయాణికులు ఇందుకు అంగీకరిస్తే రెండు టికెట్లకు మధ్య ఉన్న తేడాను రైల్వేశాఖ ఆ ప్రయాణికుడికి చెల్లిస్తుంది).

ఈ పై ఐదు సందర్భాలు ఎదురైతే.. ఆ ప్రయాణికుడికి టికెట్ డబ్బులను తిరిగి ఇచ్చేస్తామని రైల్వే శాఖ అధికారికంగా తెలిపింది. #KhabarLive