టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు పై ఆయన భార్య పై అభాండాలు చల్లుతూ చిందులు తొక్కిన అందాల భామ మలైకా ఆరఓ. ఇటీవలి ఓ సంధర్బంగా ఆమె నమ్రత శిరోద్కర్ పై ఆరోపణలు చేశారు.

నేహా ధూపియా యాంకరింగ్ లో వోగ్ నిర్వహిస్తున్న బిఎఫ్ఎఫ్ఎస్ చాట్ షోలో మలైకా అరోరా, తన సోదరి అమృతా అరోరా ఇద్దరూ పలు ఆసక్తికర అంశాలపై మాట్లాడారు. ఈ షోలో బయటికి తెలిసిన విషయాలే కాక.. ఇండస్ట్రీకి సంబంధించిన అనేక రహస్యాలను బైటపెట్టారు.

నేహాతో మాట్లాడుతున్న సందర్భంలో మలైకా అరోరా షాకింగ్ విషయాలు వెల్లడించింది. మోడలింగ్ చేస్తున్న రోజుల్లో… తనకు వ్యతిరేకంగా తన సీనియర్ మోడల్స్ గ్రూపు కట్టారని తెలిపింది. అయితే ఇప్పుడు అదే వ్యక్తులతో తాను మంచి ప్రెండ్ గా వున్నానంటోంది.

ALSO READ:  'Paigah Tombs' Of Hyderabad - Architectural Marvel And Spectacular Beauty Of A Serene Mausoleum

దీంతో నేహా ఇంతకీ ఎవరు నీపై అలా చేసిన వాళ్లు అంటూ గుచ్చి గుచ్చి అడగటంతో… మలైకా నోరు విప్పింది. వాళ్లు ఏ ఉద్దేశంతో అలా చేశారో తెలియదు కానీ.. నమ్రతా శిరోద్కర్ తోపాటు మెహెర్ జెస్సియా తనకు వ్యతిరేకంగా గ్రూపు కట్టారని తెలిపింది.

దీంతో నేహా, అమృతా అరోరా ఇద్దరూ షాక్ కు గురయ్యారు. ఎందుకంటే ఆరోజుల్లో మోడలింగ్ లో టాపర్స్ గా వున్న నమ్రతా శిరోద్కర్, మెహెర్ ఇద్దరూ టాపర్స్ గా వున్నారు. వాళ్లిద్దరూ షాక్ అవటంతో… మలైకా కలగజేససుకుని ప్రస్థుతం వాళ్లతో ఎలాంటి విబేదాలు లేవని, వాళ్లిద్దరూ ఇప్పుడు మంచి స్నేహితులని మలైకా వివరించింది. అయితే అప్పట్లో నమ్రత, మెహర్ జెస్సియా తనకు వ్యతిరేకంగా గ్రూపు కట్టినా ఇప్పుడు మంచి మిత్రులని తెలిపింది. తేకాక మలైకా బాలీవుడ్ ముద్దుగుమ్మ కరీనానుద్దేశించి తనపై గాసిప్స్ ఆపాలంటూ సెటైర్ వేసింది. #KhabarLive

ALSO READ:  Mad 'Scramble' For Marriage Halls In Hyderabad